ప్రాజెక్టుల్లో తగ్గిపోతున్న నీటిమట్టాలు

ప్రాజెక్టుల్లో తగ్గిపోతున్న నీటిమట్టాలు
  • గత ఏడాది మార్చితో పోలిస్తే ఇప్పటికే పడిపోయిన నీటిమట్టాలు
  • ఈ నెలలోనే డెడ్‍స్టోరేజీకి పడిపోయే ప్రమాదం
  • జాగ్రత్తగా వాడుకోవాలంటున్న ఆఫీసర్లు

ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతున్నాయి.  ప్రాజెక్టుల్లోకి ఇన్‍ఫ్లో లేకపోవడం, ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిపోతున్నాయి. మార్చి నెలలోనే ఆందోళన కలిగించే స్థాయికి నీటిమట్టాలు పడిపోగా ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మే నెలల్లో నీటి నిల్వలు పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆఫీసర్లు సూచిస్తున్నారు.

 

నిర్మల్‍, వెలుగు : ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాలోని ప్రాజెక్టులు, వాగులు, చెరువుల్లో నీటి నిల్వలు  ఇప్పుడే తగ్గిపోతున్నాయి. గత ఏడాది మార్చితో పోలిస్తే ఈ ఏడా ది ఇప్పటికే  పడి పోయాయి. కడెం, సాత్నాల, మత్తడివాగు, వట్టివాగు, గడ్డెన్న వాగు, స్వర్ణ
ప్రాజెక్టుల్లో గత ఏడాది కంటే 2 నుంచి 3 ఫిట్ల వరకు నీటి మట్టాలు పడి పోయాయి. వీటిలో స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులు డెడ్‌‌ స్టోరేజీకి దగ్గర పడగా, కడెం ప్రాజెక్టులో 7 టీఎంసీలకు గాను 4 టీఎంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆయా ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు పంటలకు సాగు నీరు అందిస్తున్నారు. మరో నెల రోజులపాటు పంటలకు నీళ్లు అందించాల్సి ఉంది. ఆ లోగా వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెవల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడిపోతే నీటి విడుదల ఆపేసే పరిస్థితి వస్తుంది. నిర్మల్‍ జిల్లాకు సాగునీరు అందించే ఎస్సారెస్పీ ప్రాజెక్టులో 90 టీఏంసీలకు గాను  49 టీఏంసీలు మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సరస్వతీ, లక్ష్మీ, కాకతీయ కెనాల్‍తోపాటు మిషన్‍భగీరథ కింద నిర్మల్‍, నిజామాబాద్‍, ఆదిలాబాద్‍, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలకు 7,906 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాకు సరస్వతీ కెనాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సాగు నీరు విడుదల చేస్తున్నారు. ఈ కాలువ కింద 38 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఉన్న 49 టీఎంసీలను వచ్చే రెండు నెలలపాటు సాగు, తాగునీటి అవసరాలకు వాడాల్సి ఉంది.  దీంతో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఆన్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. రైతులు నీరు వృథా చేయవద్దని కోరుతున్నారు. 

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

జిల్లాలో ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి మొదటి వారంలోనే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రాజెక్టుల నీరు ఆవిరైపోతోంది. అటు భూగర్భ జలాలు సైతం పడిపోతున్నాయి. వచ్చే నెలలో  మరింత క్లిష్ట పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి. ఏటా ఉమ్మడి జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం ముందస్తు చర్య లు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..

 జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. స్వర్ణ ప్రాజెక్టులో గత ఏడాది కంటే 2 ఫిట్లు తగ్గిపోయాయి. అందుకే రైతులకు ఆన్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నీరందిస్తున్నాం. వారం రోజులు నీటిని విడుదల చేస్తే నాలుగు రోజులు ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాం. దీని ద్వారా నీరు వృథాగా పోకుండా ఉంటుందిరైతులు తక్కువ నీటిని వాడి ఎక్కువ దిగుబడి వచ్చేలా చూసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం.-మల్లికార్జున్‍, ఈఈ ఇరిగేషన్‍

ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల రిపోర్టు ( టీఎంసీల్లో )
ప్రాజెక్టు             సామర్థ్యం        ప్రస్తుతం        ఆయకట్టు(ఎకరాల్లో)

ఎస్సారెస్పీ            90                  49            38,000
కడెం                   7.60               4.68         68,000
స్వర్ణ                   1.48               0.76         10,000
గడ్డెన్న వాగు        1.85               1.36         14,000
సాత్నాల              1.24               0.26         24,000
మత్తడివాగు          0.57               0.30           8,500
వట్టివాగు             2.89                2.13         24,500
కొమురం భీం       10.39               8.54         45,500